Red Alert: తెలంగాణ అంతటా రెడ్ అలర్ట్
వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం, గురువారం రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ మేరకు ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు.

రెడ్ అలర్ట్ : వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, మాల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి , ఖమ్మం , భూపాలపల్లి, ములుగు జిల్లాలకు…
ఆరెంజ్ అలర్ట్ : హైదరాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి , మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నల్లగొండ, సిద్దిపేట జిల్లాలకు
రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈమేరకు హైదరాబాద్‌లో ఇవాళ రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న తెలిపారు.
Also Read : అమెరికాలో హైదరాబాద్ విద్యార్ధి మృతి