LoackDown: Metro Rail సమయాల్లో మార్పులు
హైదరాబాద్ (CLiC2NEWS): లాక్డౌన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ప్రగతిభన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షుతన సమావేశమైన కేబినెట్ కరోనా నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు గంటల పాటు భేటీ అయిన కేబినెట్లో లాక్డౌన్ సహా పలు అంశాలపై చర్చించి మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు మినహాయింపు నిచ్చారు. ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
కాగా హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 7 నుంచి ఉదయం 8:45 వరకే మెట్రో సేవలు ఉండనున్నాయి. ఉదయం 8:45 కే చివరి మెట్రో నడవనుంది. ఉదయం 9:45 చివరి స్టేషన్ కు మెట్రో రైలు చేరుకోనుంది.