Mandapeta: వేములపల్లి వైఎస్ జగన్ కాలనీ గృహ నిర్మాణ దారులకు అవగాహన..
మండపేట (CLiC2NEWS): పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా వైయస్సార్ జగన్ అన్న కాలనీ కి సంబంధించి మూడో వార్డు సచివాలయంలో నాలుగు ఐదు ఆరు వార్డుల గృహ నిర్మాణదారులతో అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని లబ్ధిదారుల అంతా అందిపుచ్చుకోవాలని కోరారు. లబ్దిదారులు అంతా గృహాలు నిర్మించుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జగన్ చేపట్టిన మహా యజ్ఞానికి లబ్ధిదారులు అంతా సహకరించాలని అన్నారు. ప్రతి పేదవాడి కళ నెరవేరే రోజులు వచ్చాయని అన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు హౌసింగ్ ఏఈలు లబ్ధిదారులకు వివరించారు. నాలుగో వార్డు ఇన్ చార్జి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మీగడ శ్రీనివాస్ మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన తాము కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందువల్ల తొందరలోనే గృహాలు నిర్మించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ యన్నన ప్రభావతి, సి ఎల్ టి సి సూర్య ప్రకాష్, మెప్మా టిఈ ఫణికుమార్, సీవో వరలక్ష్మి ఆర్పీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.