Uttarkashi Cloudburst: కొనసాగుతున్న గాలింపు చర్యలు
డెహరాడూన్ (CLiC2NEWS): ఉత్తర కాశీలో ఒక్కసారిగా విచుకుపడ్డ రాకాసి వరదల్లో తప్పి పోయిన వారి కోసం భద్రతా దళాలు, ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది బుధవారం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గంగోత్రికి వెళ్తే మార్గంలో ఉన్న ధరాలి గ్రమం దాదాపు 50 శాతంపై ఖీర్ గంగా వరదల్లో కొట్టుకుపోయింది. ధరాలి లోని ఇళ్లు, చెట్లు, కార్లు, వరదల్లో కొట్టుకుపోయాయి. ఖీర్ గంగా ఆకస్మీక మెరుపు వరదల్లో పలు అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
उत्तरकाशी में आपदा प्रभावित क्षेत्र का हवाई निरीक्षण किया।#Uttarkashi pic.twitter.com/IFnrxRkegD
— Pushkar Singh Dhami (@pushkardhami) August 6, 2025
ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 163 రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. ధరాలి గ్రామం వీధులు బురదతో నిండిపోయింది. దాంతో ఎంతో అందమైన ధరాలి ఎటు చూసినా హృదయవిదారకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు దాదాపు 130 మందిని భద్రతా దళాలు సరక్షిత ప్రాంతాలకు తరలించారు.
ధరాలి ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్ సింగ్ ధామి హెలికాప్టర్ ద్వారా ఎరియల్ సర్వే చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితుల కోసం మందులు, ఆహారం ఏర్పాటు చేశామని తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సిఎం కార్యాలయం నుంచి ముగ్గురు నోడల్ అధికారులను నియమించినట్లు సిఎం తెలిపారు.
కానీ ధరాలి వరదల్లో చిక్కుపోయిన వారిని వెతికేందుకు సైన్యం ఎమ్ ఐ -17 , చినూక్ హెలికాప్టర్లను మోహరించింది.
తప్పకచదవండి: గుమ్లాలో ఎన్ కౌంటర్

[…] […]