Telangana: `కాళేశ్వరం`పై సిబిఐ విచారణ: సిఎం రేవంత్
హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నిజనిర్ధారణ చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిబిఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ ఘోష్ అందజేసిన కాళేశ్వరం రిపోర్టు పై ఆదివారం నాడు సభలో సుదీర్గ విచారణ సాగింది. ఈ సందర్భంగా సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక రకంగా యుద్ధ వాతావరణం కొనసాగింది.
ఘోష్ రిపోర్టుపై సభలో ముఖ్యమంత్రి , మంత్రులు, పలువురు అధికార పక్షానికి చెందిన సభ్యులు, బిఆర్ ఎస్ సభ్యులు, బిజెపి, ఎమ్ ఐ ఎమ్, తదితర సభ్యులు మాట్లాడారు.
సిఎం మాట్లాడుతూ….
“ఘోష్ తన నివేదికలో క్రమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను ప్రస్తావించారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, నిర్మాణానికి సంబంధించి అసలు ప్లానింగ్ లేదని తేల్చి చెప్పిందని, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్ , డిజైన్, క్వాలీ కంట్రోల్ లో లోపాలు కారణాలు అని తేలింది. సమగ్రంగా వీటిపై దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అందుకే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నాం.. సిబిఐ విచారణ నిజాయితీతో జరగాలని ఆశిస్తున్నాం. .. “ అని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ నివరధికంగా వాయిదా పడింది.
Alsor Read: రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్
[…] […]
[…] […]