మేయ‌ర్ దంప‌తుల హ‌త్య కేసు నిందితుల‌కు ఉరిశిక్ష

చిత్తూరు (CLiC2NEWS): 2015 న‌వంబ‌ర్‌ చిత్తూరులో అప్ప‌టి మేయ‌ర్ దంప‌తుల హ‌త్య జ‌రిగింది. ఈ కేసులో న్యాయ‌స్థానం నేడు తీర్పును వెలువ‌రించింది. కేసులో ఐదుగురు నిందితుల‌కు ప్ర‌మేయం ఉంద‌ని చిత్తూరు ఆరో అద‌న‌పు జిల్లా సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి ఇటీవ‌ల తీర్పును ఇచ్చారు. న్యాయ‌స్థానం నేడు వారికి ఉరిశిక్ష ఖ‌రారు చేసింది.

చిత్తూరు మేయ‌ర్ క‌ఠారి అనురాధ‌, మోహ‌న్ దంప‌తుల‌ను న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాల‌యంలోనే హ‌త్య చేశారు. మోహ‌న్ మేన‌ల్లుడు శ్రీ‌రామ్ చంద్ర శేఖ‌ర్ తో పాటు మ‌రో న‌లుగురు బుర‌ఖాలు ధ‌రించి తుపాకులు, క‌త్తుల‌తో దాడి చేశారు. అనురాధ‌పై కాల్పులు జ‌రిపి, మోహ‌న్‌ను క‌త్తుల‌తో నరికి హ‌త్య చేసిన‌ట్లు స‌మాచారం. ఈ కేసులో ముందుగా మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ప‌దేళ్ల‌కు తీర్పును వెలువ‌డిని ఈ కేసు 352 వాయిదాలు ప‌డింది. ఈ కేసుకు సంబంధించి 130 మంది సాక్షుల‌ను విచారించారు. నేడు శిక్ష‌ను ఖారారు చేశారు. ఐదుగురిలో ఎ1గా ఉన్న శ్రీ‌రామ్ చంద్ర‌శేఖ‌ర్ అలియాస్ చింటూ.. రూ.70 ల‌క్ష‌లు ప‌రిహారం చెల్లించాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. మేయ‌ర్ దంప‌తుల వార‌సుల‌కు రూ.50 ల‌క్ష‌లు, వీరి హ‌త్య జ‌రిగే స‌మ‌యంలో గాయ‌ప‌డిన వేలూరి స‌తీష్ కుమార్ నాయుడికి రూ.20 లు చెల్లించాల‌ని స్ప‌ష్టం చేసింది.

కోడూరులో నీట మునిగిన పొలాల‌ను ప‌రిశీలించిన ప‌వ‌న్‌

Leave A Reply

Your email address will not be published.