స‌బ్‌వేలో నిలిచిపోయిన మెట్రో రైలు

చెన్నై (CLiC2NEWS): త‌మిళ‌నాడులోని చెన్నై మెట్రోరైలు స‌బ్‌వేలో చిక్కుకుపోయింది. న‌గ‌రంలోని సెంట్ర‌ల్ మెట్రో – హైకోర్టు స్టేష‌న్ మ‌ధ్య‌లో రైలు ఒక్క‌సారిగా ఆగిపోవ‌డంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. దాంతో చేసేదేమి లేక ప్ర‌యాణికులు రైలు దిగి ట్రాక్‌పై న‌డ‌వాల్సిన ప‌రిస్థితి.

ఈ ఘ‌ట‌న‌పై మెట్రో ఉన్న‌తాధికారులు స్పందించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య వ‌ల్లే ప్ర‌యాణికుల‌కు ఈ అసౌర్యం ఏర్ప‌డింద‌ని అధికారులు వెల్ల‌డించారు.

మెట్రో రైలు దాదాపు 10 నిమిషాల పాటు స‌బ్ వేలో నిలిచిపోయింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియాలో ప్రయాణికులు పోస్టు చేయ‌డంతో అవి వైర‌ల్ అయ్యాయి. ప్ర‌యాణికులకు కలిగిన అసౌక‌ర్యానికి మెట్రో అధికారులు క్ష‌మాప‌ణ‌లు కోరారు. సాంకేతిక స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంతో రైలు సేవ‌లు తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి.

Also Read: పంచాంగం: న‌వంబ‌రు 30 – డిసెంబ‌రు 6 (2025)

 

1 Comment
  1. […] స‌బ్‌వేలో నిలిచిపోయిన మెట్రో రైలు […]

Leave A Reply

Your email address will not be published.