విద్యార్థినులను వేధించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
తిరుపతి (CLiC2NEWS): ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత మందికి శిక్షలు పడుతున్నా చిన్నారులు, మహిళలు వేధింపులకు గురౌతూనే ఉన్నారు. ఇలా వేధింపులకు గురిచేసే వారు వారికి దగ్గరగానే ఉంటున్నారు. వారి బంధువుల్లోనో, స్నేహితుల్లోనో ఇలాంటి వారు ఉంటున్నారు. వారి చుట్టుపక్కలే ఉంటున్నారు.
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యుయుడు మద్యం మత్తులో విద్యార్థినులను వేధించిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. బాలాయపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జయంపు ఎస్‌సి కాలనీలో ఉపాధ్యుయుడిగా పనిచేస్తున్న చిన్న అంకయ్యపై పోక్సో కేసు నమోదు చేశారు. అంకయ్య మద్యం తాగి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఉపాధ్యుయుడి ప్రవర్తన గురించి తల్లిదండ్రులు ఎంఇఒ దృష్టికి తీసుకెళ్లారు . ఎంఇఒ, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.