ఎసిబి వ‌ల‌లో గిరిజ‌న సంక్షేమ శాఖ ఇఎన్‌సి

విజ‌య‌వాడ (CLiC2NEWS):  భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ  గిరిజ‌న సంక్షేమ శాఖ ఇఎన్‌సి అబ్బ‌వ‌ర‌పు శ్రీ‌నివాస్ ఎసిబికి చిక్కారు. గుత్తే దారు కృష్ణంరాజు నుండి రూ.25ల‌క్ష‌లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ (ACB) అధికారుల‌కు చిక్కారు. ఏక‌లవ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు ఇఎన్‌సి శ్రీ‌నివాస్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. గుత్తే దారు ఇప్ప‌టికే శ్రీ‌నివాస్‌కి రూ.25 ల‌క్ష‌లు చెల్లించారు. అయినా.. మ‌రో రూ.25 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డంతో గుత్తేదారు ఎసిబిని ఆశ్ర‌యించారు. అధికారులు శ్రీ‌నివాస్ లంచం తీసుకుంటుండ‌గా రెడ్‌హాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

త‌ప్ప‌క చ‌ద‌వండి:  Murudeshwar: రెండో అతిపెద్ద శివుడి విగ్ర‌హం

 

Leave A Reply

Your email address will not be published.