ప్ర‌ముఖ‌ క‌వి, ర‌చ‌యిత అందెశ్రీ క‌న్నుమూత‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): జ‌య జ‌య‌హే తెలంగాణ జ‌న‌నీ జ‌య కేత‌నం.. అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన ర‌చ‌యిత, క‌వి అందెశ్రీ క‌న్నుమూశారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌గా కుటుంబస‌భ్యులు గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. అందెశ్రీ సిద్దిపేట జిల్లా రేబ‌ర్తిలో జ‌న్మించారు. ఆయ‌న అస‌లు పేరు అందె ఎల్ల‌య్య‌. ఆయ‌న పాఠ‌శాల‌కు వెళ్లి చ‌దువుకోలేదు. గొర్రెల కాప‌రిగా, భ‌వ‌న నిర్మాణ కార్మికుడిగా ప‌నిచేశారు. చ‌దువు లేకుండానే క‌విగా, ర‌చ‌యిత‌గా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు.

Also Read: ఎవిఎన్ఎల్‌లో జూనియ‌ర్ టెక్నీషియ‌న్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.