పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
జగిత్యాల(CLiC2NEWS): జగిత్యాల జిల్లా మేడిపల్లి ఉన్నత పాఠశాలలో 1995-1996 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం బాలల దినోత్సవం సందర్భంగా 25 వసంతాల సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకున్నారు. మేడిపల్లి పి ఎన్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ నాటి స్మృతులను నెమరువేసుకుంటూ ఆనందోత్సవాల మధ్య సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గంగాధర్, యాదగిరి, జాన్ కర్ రెడ్డి, తిరుపతి, జల, అరుణ, అన్నపూర్ణ, పద్మ, రజితలు మాట్లాడుతూ అందరూ ఎక్కడో వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో స్థిరపడ్డ కూడా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తగిన తెలిపారు. ప్రతి సంవత్సరం అలాగే ఈ రోజు కలవడానికి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు గుర్తుండిపోయే విధంగా ప్రతి ఒక్కరికి మెమొంటో అందించారు. తాము చదివిన పాఠశాలకు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
