అది గొప్ప ముంద‌డుగ‌వుతుంది: రాహుల్ గాంధీ

ఢిల్లీ (CLiC2NEWS):కాంగ్రెస్ మ‌హాధ‌ర్నాకు రాష్ట్రప‌తి స్పందిస్తార‌ని.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశ రాజ‌ధా ని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టి మ‌హాధ‌ర్నాను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 42% బిసి రిజ‌ర్వేష‌న్ (BC Reservation) బిల్లును రాష్ట్రప‌తి ఆమోదించాల‌నే డిమాండ్‌తో మ‌హాధ‌ర్నా చేప‌ట్టారు. కుల‌గ‌ణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామ‌ని రాహుల్ గాంధీ అన్నారు. బిసి బిల్లును రాష్ట్రప‌తి ఆమోదిస్తే అది గొప్ప ముంద‌డ‌గ‌వుతుంన్నారు. ఈ పోరాటం తెలంగాణ కోసంమే కాద‌న్నారు. దేశంలోని అణ‌గారిన వ‌ర్గాలంద‌రి కోసమ‌న్నారు. ఈ ధ‌ర్నాకు హాజ‌రైన ఇండియా కూట‌మి నేత‌ల‌కు రాహుల్ గాంధీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Also Read:  ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మ‌హాధ‌ర్నా..

Leave A Reply

Your email address will not be published.