Rain Alert: అప్ర‌మ‌త్తంగా ఉండాలి: సిఎం రేవంత్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. వినాయ‌క చ‌వితి నేప‌థ్యంలో మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంబాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్ల నుండి భ‌క్తుల‌కు ప్ర‌మాదం బారిన ప‌డ‌కుండా అధికారులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సిఎం ఆదేశించారు.

తెలంగాణ‌ వ్యాప్తంగా కురుస్తున్న వార్షాల‌పై అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలిపారు. న‌దులు, వాగుల‌పై నీటి ప్ర‌వాహం ఉంటే ఆ ప్రాంతంలో రాక‌పోక‌లు నిలిపివేయాల‌ని ఆదేశించారు. అలాగే వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా గ్రామ పంచాయ‌తి, మున్సిప‌ల్‌, న‌గ‌ర పాల‌క అధికారులు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

 

Also Read: Telangana Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా ముసురు

Leave A Reply

Your email address will not be published.