AP Rain Alert: ఎపికి భారీ వర్ష సూచన
అమరావతి (CLiC2NEWS): వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా తీరానికి అనుకొని ఏర్పడిన ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఎపి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వినాయక చవితి నేపథ్యంలో మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. కోస్తా తీరం వెంట 40 నుండి 60 కి. మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జాలర్లు చేపల వేటకు వెళ్లవద్ద ని అధికారులు సూచించారు.
వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఎపిలోని విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చిరించారు.
మరోవైపు విజయవాడ లో ఇవాళ( బుధవారం) ఉదయం నుంచే ముసురు పెడుతోంది. ఎడతెరిపి లేని వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విఎంసీ సిబ్బంది రహదారులపై నిలిచిన నీటిన ట్యాంకర్ల ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.