EB-1 గ్రీన్ కార్డు పొందిన వెంక‌ట చ‌ర‌ణ్‌..

Venkat Charan: విశాఖ ప‌ట్టాణానికి చెందిన వెంక‌ట్ చ‌ర‌ణ్ కు అమెరికా ప్ర‌భుత్వం అరుదైన గుర్తింపునిచ్చింది. ఏదైనా రంగంలో ఆసాధార‌ణ ప్ర‌తిభ చూపిన వారికి ఇచ్చే ఇబి-1 గ్రీన్ కార్డు అంద‌జేసింది. సాధార‌ణంగా ఆస్కార్‌, ఒలింపిక్స్ ప‌త‌కాలు, నోబెల్ బ‌హుమ‌తులు సాధించిన స్థానికేత‌రుల‌కు అమెరికా ఇస్తుంది. ఫ్రిక్ష‌న్‌ వెల్డింగ్‌పై చేసిన ప‌రిశోధ‌న కార‌ణంగా అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది. దీనిని 25 దేశాలు గుర్తించాయి. ఈ రంగంలో చేస్తున్న కృషికి గాను చ‌ర‌ణ్‌కు ఈ అరుదైన గుర్తింపు ల‌భించింది. విమానాల త‌యారీ , భారీ వంతెన‌ల నిర్మాణం, గ్యాస్ పైపులైన్‌ల‌లో వెల్డింగ్ పాత్ర చాలా ముఖ్య‌మైన‌ది.

15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంక‌ట్ చ‌ర‌ణ్.. ప్ర‌స్తుతం అమెరికాలోని ఓ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ సంస్థ‌లో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఆఫ్ క్వాలిటి హోదాలో సేవ‌లందిస్తున్నారు. ఈయ‌న రాసిన ప‌రిశోధ‌న అంశాల‌ను 25 దేశాల పరిశోధ‌కులు 400 సార్లు ప్ర‌స్తావించారు. అత‌ను చేసిన ఫ్రిక్ష‌న్ వెల్డింగ్‌పై చేసిన ప‌రిశోధ‌ర స‌రికొత్త రీతిలో ఉండ‌టంతో అత‌నికి తోడైంది.

చ‌ర‌న్ త‌యారీ రంగంలో అంత‌ర్జాతీయ నిపుణిగా ఎదిగారు. ఉత్ప‌త్తుల నాణ్య‌త గుర్తించి ధ్రువీక‌ర‌ణ అందించే స్థాయికి చేరుకున్నారు. 20కి పైగా అంత‌ర్జాతీయ జ‌ర్న‌ల్స్‌లో ఆయ‌న ప‌రిశోధ‌న ప‌త్రాలు ప్ర‌చురిత‌మయ్యాయి. 85 దేశాల‌కు చెందిన ఇంజినీర్లున్న మెంబ‌ర్ ఆఫ్ సొసైటి ఫ‌ర్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ ఇంజినీర్స్ స‌భ్యుడిగా ఉన్నారు. ఆ సంస్థ‌నుండి అత్యంత ప్ర‌తిభ క‌లిగిన ఉత్త‌మ యువ ఇంజినీర్ అవార్డు సాధించారు. ఉన్న‌త చ‌దువులు, ఉద్యోగాల‌కు విదేశాల‌కు వెళ్లే యువ‌త కోసం స‌హకారం అందించేందుకు అచీవ‌ర్ ఓవ‌ర్‌సీస్ ఎడ్యుకేష‌న్ ఎడ్యుకేష‌న‌ల్ స‌ర్వీసెస్ అనే పేరుతో ఎలా వెళ్లాలి.. ఎక్క‌డ చ‌ద‌వాలి.. త‌గిన స‌ల‌మాలు ఇస్తూ మార్గ‌ద‌ర్వ‌క‌త్వం చేస్తున్నాడు.

 

 

Leave A Reply

Your email address will not be published.