మార్పు కోసం నా అక్షరాలు

మార్పు కోసం నా అక్షరాలు

నగరాల వెలుగుల్లో నీడలు పెరుగుతుంటే
గ్రామాల నిశ్శబ్దంలో బాధలు మోగుతుంటే
ఎందుకోసం సంబరాలు..
ఎవరికోసం ఈ సంబరాలు..!

మనుషుల మధ్య గోడలు ఎత్తుగా పెరిగిన వేళ
మానవత్వం పుటల్లో మౌనం చేరిన వేళ..
ఎందుకోసం సంబరాలు..
ఎవరికోసం ఈ సంబరాలు..!

మద్యము మత్తుకి బానిసై కుటుంబ-
సభ్యులను రోడ్డుపైన పడేస్తున్న వేళ..
ఎండిన డొక్కలతో అన్నం కోసం ఎదురుచూసే నిరీక్షణ కళ్లలో కారం పొడి చల్లిన వేళ..
ఎందుకోసం సంబరాలు..
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఉద్యోగ అవకాశం కోసం తలుపులు తట్టే ఆశల్లో
మన్ను కొట్టిన వేళ..
పేదల బాధలు రుధిర గీతాలై పాడిన వేళ..
ఎందుకోసం సంబరాలు..
ఎవరికోసం ఈ సంబరాలు..!

 

ప్రకృతి కన్నీటి చుక్కలు నా సాహిత్య చేతి ద్వారా
సమాజ భవిష్యత్తును ప్రశ్నిస్తున్న వేళ..
నింకను పసిమొగ్గల నుండి ముసలి ముతక వరకు
అత్యాచారాలు చేస్తూ, దాడులు చేస్తున్న వేళ..
ఎందుకోసం సంబరాలు..
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఒక్కసారి ఆలోచించండి..
ఒక్కసారి రేపటి ప్రపంచం కోసం ఆలోచించండి..

– మంజుల పత్తిపాటి

 9347042218

                                                                             

 

Also Read: ఆరోగ్యమే అసలైన ఆనందం

ప్రకృతి గర్భగుడి

Leave A Reply

Your email address will not be published.