‘బంగార్రాజు’ చిత్రం నుండి ‘నా కోసం నువ్వు’ పాట విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): నాగార్జున ,నాగచైతన్య కలసి నటిస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం’నుండి మరో పాటను విడుదల చేశారు. ‘నా కోసం నువ్వు’.. ‘అంటూ సాగే లిరికల్ పాటను చిత్ర బృందం ఆదివారం విడుదల చేశారు. ఈ గీతాన్ని సిధ్ శ్రీరామ్ ఆలపించారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కి ప్రీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు.