రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు!
ఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభ మైన తొలిరోజు పలువురు విపక్ష ఎంపీలపై రాజ్య సభలో సస్పెన్షన్ వేటు విధించారు. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పన్నెండు మంది ఎం పీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల వేటు వేసింది. వీరు ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ సభకు హాజరుకాకూడదని ప్రకటన విడుదల చేశారు.
12 మంది ఎంపీలు:
కాంగ్రెస్ ఎంపీలు పూలోదేవి నేతం , ఛాయావర్మ, రిపున్ బోరా, రాజామణి పటేల్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్,
తృణమూల్ ఎంపీలు డోలా సేన్, శాంతా ఛత్రీ, శివసేన ఎంపీలు ప్రియాంకా చతుర్వేది, అనిల్ దేశాయ్, సిపిఐ ఎంపీ బినోయ్ విశ్వం ,సిపిఎం ఎంపీ కరీం.