విమానం కూల్చివేతను అడ్డుకున్న భారత్ పైలట్..
174 మంది ప్రయాణిస్తున్న విమానంకు తప్పిన ఘోర ప్రమాదం..
174 మంది ప్రయాణికులు ఉన్న ఓ విమానాన్ని భారతీయ కెప్టెన్ ప్రమాదం నుండి రక్షించి సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ప్లైదుబాయ్‌కు చెందిన విమానాన్ని కో-పైలట్.. కూల్చి వేసేందుకు స్వయంగా ప్రయాత్నించాడు. అదే విమానంలో కెప్టెన్‌గా ఉన్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ కో-పైలట్‌ను ప్రతిఘటించారు. కాక్‌పిట్‌లో జరిగిన ఘర్షణలో మచ్చర్‌కు రక్తం కారుతున్నా ప్రాణాలకు తెగించి అతణ్ణి అడ్డుకున్నాడు. 174 మంది ప్రయాణికులు ఉన్న విమానం బుధవారం ఘోర ప్రమాదం నుండి బయటపడింది.
అంతర్జాతీయ మీడియా సంస్థల కథనం ప్రకారం.. ప్లైదుబాయ్‌కు చెందిన విమానం దుబాయ్ నుండి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు 27 మంది చిన్నారులు కూడా ఉన్నారు. కో-పైలట్ స్వయంగా కలక సిస్టమ్‌లను నిర్వీర్యం చేసి విమానం కూల్చేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. మచ్చర్‌కు కత్తిగాట్లు అయ్యాయి. రక్తం కారుతున్నా ప్రయాణికుల సహాయంతో కో-పైలట్‌ను బంధించి, విమానంను సురక్షితంగా లాండ్ అయ్యేలా చేశాడు.
దాదాపు 34వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం కేవలం రెండు నిమిషాల్లో 17వేల అడుగుల కిందకు దిగింది. గాల్లో గింగిరాలు తిరగడంతో ప్రయాణికులు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆన్-డ్యూటి ప్లైదుబాయ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాడు. విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని, సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో పలు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి. తమ ప్రాణాలు కాపాడినందుకు ప్రయాణికులంతా భారత కెప్టెన్ మచ్చర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కొన్ని గంటల తర్వాత ప్రయాణికులు మరో విమానంలో తమ గమ్య స్థానమైన టెల్ అవీవ్‌కు చేరుకున్నారు.
విమానం హైజాక్ అయినట్లు ఇజ్రయెల్ భావించింది. ఎందుకంటే.. కొ-పైలట్ విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునే చర్య ప్రారంభించినపుడు
దాన్నుంచి అంతర్జాతీయ ఎమర్జెన్సీ సిగ్నల్ అందింది. అనంతరం 4 నిమిషాలకు అది మారిపోయి.. హైజాక్ లేదా చట్టవ్యతిరేక జోక్యం కోడ్ యాక్టివేట్ అయినట్లు సమాచారం. దీంతో విమానం హైజాక్‌కు గురైందని ఇజ్రాయిల్ భావించింది. దీంతో యుద్ధవిమానాలను రంగంలోకి దింపింది.
ఈ విమానంలో ఉన్న ప్రయాణికులంతా దాదాపు ఇజ్రాయోలీలు . విమాన కో-పైలట్ ఒమన్ దేశస్థుడు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఈ చర్య.. కలకలం రేపింది. కోపైలట్ ను సౌదీ అధికారులు అరెస్టు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుండి తప్పించిన భారత పైలట్ మచ్చర్ గుజరాత్‌కు చెందినవారు. స్పైస్ జెట్ సంస్థలో పదేల్లు విధులు నిర్వహించారు. అనంతరం నాలుగేళ్లుగా ప్లైదుబాయ్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కెప్టెన్ మచ్చర్ కు చికిత్స నందిస్తున్నారు.
ప్రధాని మోడీ ప్రశంస: విషయం తెలుసుకున్న భారత ప్రధాని మోడీ .. స్మిత్ ను ప్రశంసించారు. దేశం మొత్తం అతన్ని చూసి గర్విస్తుందన్నారు. మచ్చర్ త్వరగా కోలుకోవాలని , సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఓ టివి షో గుర్తొచ్చి..విమానంలో ఓ ప్రయాణికుడు.. విమానం నడపడంలో ఎటువంటి అనుభవం లేని ఓ సాధారణ వ్యక్తి , కాక్‌పిట్‌లోపలికి ప్రవేశించి.. విమానాన్ని నియంత్రించగలిగాడు. యానివ్ హయూన్ అనే ప్రయాణికుడు వృత్తి రీత్యా ఓ ప్లంబర్.. కాక్‌పిట్‌లోకి ప్రవేశించగానే కెప్టెన్ స్మిత్ స్పృహతప్పి కిందపడిపోవడం, వేరే పైలట్ విమానం కంట్రోల్స్ దగ్గర ఉండటం గమినించాడు. విమానం కిందికి దిగిపోతున్నట్లుగా ఉండగా.. పరిస్తితిని అర్ధం చేసుకన్న ఆప్రయాణికుడు తోటి ప్రయాణికుల సహాయంతో కోపైలట్‌ను బయటకు లాగేసి.. కంట్రోల్ స్టిక్స్‌ను తన చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే వాటిని వెనుకకు లాగడంతో విమానం తిరిగి సాధారణ స్తితిలో ఉన్నట్లు గమనించాడు. అనంతరం ఆఫ్ డ్యూటీలో ఉన్న పైలట్ విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ ప్రయాణికుడుని కలిసి అభినందించారు. ప్రధానికి విమానంలో జరిగిన విషయాలన్నీ యానివ్ వివరించారు. ఆ సమయంలో ప్రధాని అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. విమానం నడపడంలో ఏమాత్రం అనుభవం లేని తాను కంట్రోల్ స్టిక్స్ వెనక్కి లాగడానికి కారణం ఓ టీవిషో అని ప్రధానికి తెలిపాడు. తాను చూసిన ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ టివిషో గుర్తొచ్చి కంట్రోల్ స్టిక్స్‌ను వెనక్కి లాగానని , తర్వాత ఆప్ డ్యూటీలోనున్న పైలట్ విమానాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకున్నట్లు సమాధానమిచ్చాడు.