బిజెపి కండువా క‌ప్పుకున్న మాజి ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు

హైద‌రాబాద్ (CLiC2NEWS): నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గ మాజి ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిఆర్ ఎస్ మాజి ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు పార్టికీ రాజీనామ చేసిన సంగ‌తి తెలిసిందే. గువ్వ‌ల బాల‌రాజు ఆదివారం బిజెపి లో చేరారు. నాంప‌ల్లిలోని పార్టి రాష్ట్ర కార్యాల‌యంలో అధ్యక్షుడు రామ‌చంద్రారావు బాల‌రాజుకి కండువా క‌ప్ఇ పార్టిలోకి ఆహ్వానించారు. తెలంగాణ‌లో బిజెపి బ‌లోపేతానికి బాల‌రాజు సేవ‌లు వినియోగించుకుంటామ‌ని అన్నారు. గువ్వల బాల‌రాజు పార్టీలోకి రావ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్రమంలో ఎంపి ల‌క్ష్మ‌ణ్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప‌లువురు బిజెపి సీనియ‌ర్ నేత‌లు పాల్గొన్నారు.

 

Also Read: బిఆర్ఎస్‌కి రాజీనామా చేసిన మాజి ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు

Leave A Reply

Your email address will not be published.