ష‌టిల్ ఆడుతుండ‌గా గుండెపోటు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌స్తుత జీవ‌నస‌ర‌ళిలో వ‌య‌స్సుతో సంబంధం లేకుండా యువ‌త కూడా కూడా గుండెపోటుకు గుర‌వ‌తున్నారు. నేటి జీవ‌న‌శైలిలో మార్పుల‌తో  చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నాగోల్లో ఓ యువ‌కుడు ష‌టిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్ప‌కూలిపోయాడు. స‌హ‌చ‌రులు అత‌నిని ఆస్ప‌త్రికి త‌ర‌లించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఖ‌మ్మం జిల్లా త‌ల్లాడ‌కు చెందిన గుండ్ల రాకేశ్‌గా గుర్తించారు.

తీరిక లేకుండా ప‌రుగులు పెడుతూ, శారీర‌క శ్ర‌మ‌పై ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం నేటి స‌మాజంలో చాలా మంది ఒత్తిడికి గుర‌వుతున్నారు.అదేప‌నిగా ఒత్తిడికి గురైతే కాలేయం ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉత్ప‌త్తి చేయాడానికి దారితీస్తుంది. శ్వాస సంబంధ వ్యాయామాలు, యోగా , వాకింగ్ వంటివి ఒత్తిడిని అదుపులో ఉంచే మార్గాలు అని నిపుణులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.