భ‌ద్రాద్రి జిల్లా టేకులపల్లి అటవీ ప్రాంతంలో పులి కలకలం

టేకులపల్లి (CLiC2NEWS): భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. ఇవాళ (శనివారం) ఉదయం మొట్లగూడెం-జంగాలపల్లి బీట్‌ పరిధిలోని జంగాలపల్లి గేట్‌ వద్ద పులి రోడ్డు దాటుతుండగా అటవీ సిబ్బంది, ట్రాక్టర్‌ డ్రైవర్లు చూశారు. దీంతో స్థానిక గ్రామాల ప్ర‌జ‌ల‌ను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని సూచించారు. సాయంత్రం వేళ ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యం తెలిసిన స్థానికులు తీవ్ర భయాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. పులిని తొందరగా పట్టుకోవాలని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.