TS: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!
ఆదిలాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో వేటగాళ్ల ఉచ్చుకు పులి బలైంది. ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండ వద్ద హీరాపూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు పులిని వేటాడి చంపారు .
పులి చర్మాన్ని కాగజ్నగర్ కు తీసుకెళ్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో నిందితులనుంచి పులి చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వేటగాళ్లను పులిని చంపిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు పోలీసులు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.