రూ.ల‌క్ష లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి

హైద‌రాబాద్ (CLiC2NEWS): రూ.ల‌క్ష లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఉద్యోగి సోమ‌వారం ఎసిబికి ప‌ట్టుబ‌డ్డారు. బోర‌బండ స‌ర్కిల్ ప‌రిధిలో ఓ భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తి ఇచ్చేందుకు టౌన్ ప్లానింగ్ జూనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌ల‌త‌ రూ.5ల‌క్ష‌లు డిమాండ్ చేశారు. వెంక‌టేశ్‌.. భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల కోసం జిహెచ్ ఎంసి బోర‌బండ స‌ర్కిల్ 37 టౌన్ ప్లానింగ్ అధికారుల‌ను క‌లిశారు. మీ సేవ అనుమ‌తుల నుండి నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కు అన్ని అనుమ‌తులు తాను చూసుకుంటాన‌ని, జూనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌ల‌త చెప్పారు. అందుకోసం రూ.5 ల‌క్ష‌లు డిమాండ్ చేశారు. ముందుగా రూ.ల‌క్ష అడ్వాన్స్‌గా ఇవ్వాల‌న్నారు. దీంతో వెంక‌టేశ్ ఎసిబి అధికారుల‌ను ఆశ్ర‌యించారు. యూస‌ఫ్ గూడ‌లోని ఓ సూప‌ర్ మార్కెట్ వ‌ద్ద సోమ‌వారం రూ. ల‌క్ష తీసుకుంటుండ‌గా.. ఎసిబి అధికారుల‌ను ఆమెని ప‌ట్టుకున్నారు. బోర‌బండ స‌ర్కిల్ కార్యాల‌యానికి శ్రీ‌ల‌త‌ను త‌ర‌లించారు. అనంత‌రం నాంప‌ల్లి లోని ఎసిబి ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి ముందు హాజ‌రు ప‌రిచారు.

Leave A Reply

Your email address will not be published.