TS: నేటి నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రెండోడోస్ వ్యాక్సినేషన్‌ను మంగళవారం నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటిడోసు వేసుకుని రెండో డోసు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నవారు సమీపంలోని ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకోవచ్చని సూచించారు.
కరోనా వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.