లోతట్టు ప్రాంతాల‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : స్పీకర్‌ పోచారం

నిజామబాద్‌ (CLiC2NEWS): గ‌త రెండు రోజుల నుండి ఉమ్మడి నిజ‌మాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకులోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కలిసి నిజాంసాగర్‌ ప్రాజెక్టును స్పీక‌ర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరంతో పాటు ఈ ఏడాది భారీ వర్షాలు కురియడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుందన్నారు. ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీరు మంజీరాలోకి విడుదల చేశామన్నారు.

Leave A Reply

Your email address will not be published.