Yaas Cyclone: `అధికారులు అప్రమత్తంగా ఉండాలి..`

అమరావతి(CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఇరిగేషన్ ఉన్న‌తాధికారులతో సోమవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

స్పందించిన విపత్తు నిర్వహణ శాఖ

యాస్ తుఫాను పై స్పందించిన ఏపీ విపత్తు నిర్వహణ శాఖ స్పందించింది. ఐఎండి సూచనల ప్రకారం… తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా‌ కొనసాగుతున్న యాస్.. ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ పారాదీప్ మరియు సాగర్ ద్వీపాల మధ్య మే 26 మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దాంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల‌ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని సూచించింది. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.