ఎపిలో వెయ్యికి చేరువ‌గా కొవిడ్ కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు ఏకంగా వెయ్యికి చేరువగా దూసుకెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,604 సాంపిల్స్ పరీక్షించగా 984 కరోనా పాజిటివ్‌గా కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో మరొకరు మృతిచెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 306 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల‌తో క‌లిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,96,863కు చేరుకుంది. అలాగే కోలుకున్నవారి సంఖ్య 8,85,515కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్‌ కేసులు ఉన్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.