Mandapeta: కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో మహా మృత్యుంజయ హోమం..
మండపేట (CLiC2NEWS): కామాక్షి దేవి సమేత ఏకాంబేశ్వర స్వామి వారి ఆలయంలో మహా మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బంటుమిల్లి చంద్రశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం అత్తిలి శివ, ముండూరి భద్రాచార్యులు, కొడమంచిలి సత్యనారాయణ, ఉచ్చింతల సుబ్రహ్మణ్య శాస్త్రి, అత్తిలి రామచంద్రా చార్యులు, బంటుమిల్లి శ్రీకాంత్ శర్మ, గొంగేటి సురేష్, పిచ్చుక రాంబాబు, కలవచర్ల పరిపూర్ణా చార్యుల అర్చక బృందంతో కలిసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణం, విశ్వ శాంతి కోసం తలపెట్టిన హోమాదియాగాలకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కరోనా వేళ ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని స్వామివారు అనుగ్రహం ప్రజలందరిపై చూపించాలనే సంకల్పంతో ఈ హోమం తలపెట్టినట్టు ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి ప్రారంభమైన మహా మృత్యుంజయ, పాశుపత రుద్రా భిషేక పూర్వక మహామృత్యుంజయ పాసుపత రుద్ర హోమం కార్యక్రమాలు సాయంత్రం వరకూ జరిగాయి. శ్రీ ధన్వంతరి, శ్రీదేవి,ఆయుష్, ,శ్రీ సౌర హోమాలు నిర్వహించారు. శ్రీ వీర నారాయణ మహా మంత్ర హావనం శాంతి హోమం జరిపారు. కోవిడ్ నిభందనలు పాటిస్తూ పూజలు హోమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కోనే వీర్రాజు, వెదురుపర్తి రామకృష్ణ, కోటిపల్లి రాంబాబు, గోడి సుబ్రహ్మణ్యం, కోటిపల్లి కృష్ణమాచార్యులు, తాతవోలు మురళీ కృష్ణ, వాడారి రాము, చెల్లూరి ప్రకాష్, మైచర్ల శ్రీనివాస్, పొన్నాడ రాజా, వేముల శ్రీరామమూర్తి, పెంటపాటి చరణ్ తదితరులు పాల్గొన్నారు.