చెన్నైలో బయటపడ్డ రూ.220 కోట్ల నల్లధనం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో భారీగా నల్లధనం బయటపడింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ టైల్స్ అండ్ శానిటరీవేర్ తయారీ కంపెనీపై ఇన్‌కమ్ టాక్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఈ భారీ మొత్తం వెలుగు చూసింది. ఈ దాడిలో రూ. 220 కోట్ల లెక్కకు చూపని నగదు వెలుగుచూసింది. టైల్స్‌కు సంబంధించి లెక్క చూపని కొనుగోలు, అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నెల 26న జరిపిన సోదాల్లో తొలుత రూ.8.30 కోట్లు సీజ్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ అధికారులు తెలిపారు.