తెలంగాణ‌లో 30 మొబైల్ ఐసియు బస్సులు

ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ ఐసియు బస్సులు అందుబాటులోకి వ‌చ్చాయి. హైద‌రాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఈ బ‌స్సుల‌ను మంత్రి కెటిఆర్ గురువారం ప్రారంభించారు. ప్రారంభించిన అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. 30 మెడికల్‌ మొబైల్‌ బస్సులను అందించిన లార్డ్స్‌ చర్చికి కృతజ్ఞతలు తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి మూలంగా ఆరోగ్య‌ సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్‌ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు.

కాగా ఈ మెడికల్‌ యూనిట్‌ బస్సులో 10 బెడ్లు, వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులు అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.