దేశంలో కొత్తగా 16,752 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,96,731కు పెరిగాయి. వారిలో కొత్తగా 11,718 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం ఇప్పటి వరకు 1,07,75,169 మంది కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు. తాజాగా గడచిన 24 గంటల్లో మరో 113 మంది మృత్యువాతపడ్డారు. కాగా ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 1,57,051కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,64,511 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు బులిటెన్లో పేర్కొన్నారు.