అదుపు త‌ప్పి లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

షాద్‌న‌గ‌ర్‌: రంగారెడ్డి జిల్లాలో ఆదివారం అదుపు తప్పిన కారు డివైడర్‌పై నుంచి దూసుకువెళ్లి లారీని ఢీ కొట్టింది. జిల్లాలోని షాద్ న‌గ‌ర్ స‌మీపంలోని అన్నారం వ‌ద్ద జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మ‌ర‌ణించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌టనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.