మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌!

హైద‌రాబాద్‌: గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధర తాజాగా మళ్లీ పెరిగింది. గ‌త కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పైకి ఎగసి రూ. 45,710 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 41,900 కు చేరింది. వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 69,300 కు చేరుకుంది.

Leave A Reply

Your email address will not be published.