షేక్.బహర్ అలీ: ఆరోగ్య చిట్కాలు
వేసవి తాపానికి, శరీర సౌందర్యము కొరకు, బలానికి, త్వరగా ఆకలి వేయకుండా ఉండటానికి, మధుమేహ రోగులకు షుగర్ పెరగకుండా, షుగర్ ని నియంత్రించుటకు, రామబాణంలాంటి చక్కని ప్రకృతి వైద్యం, దీనిని ఆరోగ్యవంతులు, రోగులు, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఈ ఎండాకాలంలో చక్కగా ఈ జావా తయారుచేసుకొని ఉదయం పూట ఈ జావా తాగితే అతిమధురం, అమెహం, అద్భుతం, ఔషథం కూడా … సుమా

జావా తయారుచేసుకునే విధానం.
1 బార్లీ పొడి , 2 టీ స్పూన్స్ తీసుకుని రాత్రి ఒక పెద్ద గ్లాస్ నీటిలో నానపెట్టి, తెల్లవారుజామున ఇంకొక గ్లాస్ నీరు కలిపి స్టవ్ (పొయ్యి) సిమ్ మీద పెట్టి దాని మీద ఈ పౌడర్ నీరు బాగా మరిగించాలి. మరిగించేటపుడు దానిలో చిన్న చిన్న టమాటా ముక్కలు వేయాలి. రెండు గ్లాస్ లా జావా ఒక గ్లాస్ వరకు చేసి పొయ్యి మీద నుండి దింపి దానిలో చిటికెడు ఉప్పు కలిపి గోరువెచ్చని జావా నిదానంగా తాగాలి. బీపీ ఉంటే ఉప్పు కలపరాదు.
-షేక్.బహర్ అలీ