అన్న‌దాత‌ల‌కు అండ‌గా చిట్టిత‌ల్లి.. ఫొటో వైర‌ల్‌

న్యూఢిల్లీ: గ‌త 23 రోజులుగా రైత‌న్న‌లు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే.. కేంద్రం కొత్త‌గా తెచ్చిన నూత‌న‌ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో అన్న‌దాత‌లు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. శీతాకాలం.. చలిలో రైతన్నలు అలుపెరుగని పోరాటం చేస్తుంటే.. మేము సైతం అంటూ.. చిన్నారులు కూడా పెద్దల అడుగులో అడుగు వేస్తున్నారు. ఓ చిట్టితల్లి తన చిన్నిచిన్ని చేతులతో, చ‌క్కని చిరునవ్వులతో అన్నదాతలకు రొట్టెలను వడ్డిస్తున్న ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే కొంతమంది చిన్నారులు పగలంతా ఆందోళనలో పాల్గొనే తల్లిదండ్రులకు సాయం చేస్తూ, రాత్రిళ్లు దీపాల వెలుగులో చదువుకుంటున్న సంగతి తెలిసిందే.

link gacor

Leave A Reply

Your email address will not be published.