టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా చింతా సాయిలు

హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) తాత్కాలిక చైర్మన్‌గా ప్రొఫెస‌ర్‌ చింతా సాయిలు నియమితులయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో టీఎస్‌పీఎస్‌సీలో మిగిలిన ఏకైక సభ్యుడు సాయిలు తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. స‌భ్యుడిగా సాయిలు ప‌ద‌వీకాలం న‌వంబ‌రు 1 వ‌ర‌కు ఉంది. పూర్తిస్థాయి చైర్మన్‌ను నియామకం జరిగే వరకు సాయిలు ఈ పదవీలో కొనసాగనున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ చింతా సాయిలుకు పుష్ప‌గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న టీఎస్‌పీఎస్‌సీ కార్య‌ద‌ర్శి వాణీమోహ‌న్‌
Leave A Reply

Your email address will not be published.