గుర్తు పట్టలేని విధంగా అభిషేక్ బచ్చన్!
అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బాబ్ బిస్వాస్ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో అభిషేక్ సరసన చిత్రాంగద నటిస్తోంది. షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు సుజోయ్ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన షూటింగ్ కోల్‌కతాలో తాజాగా తిరిగి ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా, అభిషేక్ బచ్చన్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. అభిషేక్ బచ్చన్ తన గెటప్ పూర్తిగా మార్చుకుని అందరికీ షాకిచ్చాడు. బాబ్ బిశ్వాస్ సినిమా కోసం మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కనిపించడానికి చెదిరిన జుట్టు, పెద్ద కళ్లజోడు, కాస్త బరువుతో కనిపించాడు.