తెలంగాణ పోలీసులకు ‘స్కోచ్’ అవార్డు
హైదరాబాద్: తెలంగాణ పోలీ్‌సశాఖకు బంగారు స్కోచ్ అవార్డు వరించింది. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినందుకు ఈ అవార్డు లభించింది. జాతీయస్థాయిలో పోలీసులు టెక్నాలజీ వినియోగించి సేవలందించడంపై స్కోచ్ గ్రూప్ బుధవారం అవార్డులను ప్రకటించింది. సాంకేతికత సాయంతో కొవిడ్ రోగుల కాంటాక్టులను గుర్తించడం, సమర్థంగా లాక్డౌన్ అమలు, అత్యవసర వైద్యసేవల్లో సహకారం, నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం సంప్రదింపు కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటు, లాక్డౌన్లో ఆకలితో అలమటించేవారికి ఎన్జీవోలు, ‘రెస్ఫాన్స్ టు కోవిడ్-19’ కేటగిరిలో మొదటిస్థానం సాధించి.. బంగారు స్కోచ్ అవార్డుకు తెలంగాణ పోలీ్‌సశాఖ ఎంపికైంది. స్కోచ్ గ్రూప్ ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొని బంగారు స్కోచ్ అవార్డును అందుకున్నారు.
Telangana State Police bagged “SKOCH Gold 2020″Award in the category of Response to Covid-19.
Dr. M Mahendar Reddy IPS, DGP Telangana has shared the screen to receive the award in a virtual award ceremony.@TelanganaDGP pic.twitter.com/IPGj7CvSE1— Telangana State Police (@TelanganaCOPs) October 28, 2020