రణబాలి నుండి ‘ఏందయ్య సామీ’.. ఫుల్‌సాంగ్ రిలీజ్
Ranabali: విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రంలోని ఏందయ్య సామీ ఫుల్ సాంగ్ రిలీజయింది. ఆరు నెలల క్రితం చిన్న బీట్ విడుదలైతేనే ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ విడుదలైంది. అమ్మావో .. ఆలివో .. నువ్వు ఎవరో కానీ.. ఏలవే రణబాలిని రాణి.. అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రచించగా.. శ్వేతా మోహన్ , అజయ్ ఆలపించారు. దీనికి అజయ్-అతుల్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం వచ్చే నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.