127 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పివి నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ వర్సిటీలో మొత్తం 127 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
పివి నరసింహారావు వెటర్నరీ వర్సిటీలో..
- సీనియర్ అసిస్టెంట్ పోస్టులు-15
- జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-10
ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో
- జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులు-102
ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌కు లాగినై తెలుసుకోవచ్చు.