NHPC: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 248 పోస్టులు
NHPC: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC)లో 248 జూనియర్ ఇంజినీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ సంస్థ. ఇది ప్రస్తుతం నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం పోస్టులు 248
జూనియర్ ఇంజినీర్ సివిల్ – 109
జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ -46
జూనియర్ ఇంజినీర్ మెకానికల్ – 49
జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ -17
అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్ ఇ1 గ్రేడ్ – 11
సూపర్ వైజర్ (ఐటి) – 1
సీనియర్ అకౌంటెంట్ – 10
హిందీ ట్రాన్స్ లేటర్ – 5
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 708 గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు , ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
60% మార్కులతో సిఎ, సిఎంఎ, డిప్లొమా , డిగ్రీ , పిజి ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగానుభవం తప్పనిసరి.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి జూనియర్ ఇంజినీర్, సూపర్ వైజర్, సీనియర్ అకౌంటెంట్‌కు రూ. 29,600 నుండి రూన 1,19,500 వరకు వేతనం లభిస్తుంది.
హిందీ ట్రాన్స్‌లేటర్కు రూ.27,000 నుండి రూ. 1,05,000 వరకు ఉంటుంది.
అసిస్టెంట్ రాజ్‌భాషా ఆఫీసర్‌కు రూ. 40వేలు నుండి రూ. 1,40,000 వరకు ఉంటుంది.
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ఒబిసిలకు మూడేళ్లు.. ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.
Also Read: Telugu Basha Dinotsavam: తెలుగు వెలుగు
What a stuff of un-ambiguity and preserveness of valuable experience on the topic of unexpected
emotions.
[…] NHPC: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర… […]
[…] NHPC: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర… […]
Keep on writing, great job!