Telugu Basha Dinotsavam: తెలుగు వెలుగు

త్రిలింగ దేశాన అలరారు భాష

తలకట్టు మకుటమై భాసిల్లు భాష

కృష్ణరాయలు పొగడిన నా భాష

ద్రావిడ దేశాన నిగడిన నాభాష

దేశ దేశాన పండితులు మెచ్చిన భాష

పలికిన పలుకుతో ఆయువు పెంచు భాష

నన్నయ నుండి నవయువ కవిదాక

తెలుగు పద వేదాలు వల్లించు భాష

అమ్మ పలుకుల అమృతమ్ము నా అజంత భాష

యే వేషమందున్న యే దేశమందున్న

తెలుగు భాషాయోషామణిని కీర్తుంచు మన్నా

పరభాష లెన్నియు భాషించినా

నీ భాషను మరిచి శ్వాసించకన్నా

మన భాష మన యాస మాట్లాడుతూ

తెలుగు పదబంధ మాధూర్యమును గ్రోలుమన్నా

ఆత్మీయ అనుబంధములు పెంచుతూ

తెలుగువెలుగుల సౌరు విరజిల్లుమన్నా.

-శేషం శ్రీనివాసా చార్య
Rtd GHM, సెల్ నం: 94406 59257
( తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా

 

Also Read: Kamareddy:కామారెడ్డిలో వ‌ర‌ద బీభ‌త్సం

Leave A Reply

Your email address will not be published.