ఎయిర్‌పోర్ట్ అథారిటిలో 976 పోస్టులు

AAI: ఎయిర్‌పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా (AAI) లో జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive)పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

అర్కిటెక్చ‌ర్‌/ సివిల్ / ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్ / ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జిలో డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 28 వ తేదీ నుండి స్వీక‌రిస్తారు. చివ‌రి తేదీ 27.09.2025. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.300 గా నిర్ణ‌యించారు. ఎస్‌టి, ఎస్‌సి, పిడ‌బ్లుబిడిల‌కు ఫీజు లేదు.

976 జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఆర్కిటెక్చ‌ర్ -11, సివిల్ – 199, ఎల‌క్ట్రిక‌ల్ – 208, ఎల‌క్ట్రానిక్స్ 527, ఐటి 31 పోస్టులు క‌ల‌వు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభ‌వం క‌ల‌వారికి ప్రాధాన్య‌త ఉంటుంది.

వ‌య‌స్సు 27.9.2025 నాటికి 27 ఏళ్లు వ‌య‌స్సు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టిల‌కు 5 ఏళ్లు.. ఒబిసిల‌కు 3 ఏళ్లు , పిడ‌బ్ల్యుబిడికి 10 ఏళ్లు స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

ఈ పోస్టుల‌కు ఎంపికై న వారికి నెల‌కు వేత‌నం రూ. 40 వేల నుండి రూ.1,40,000 వ‌ర‌కు ఉంటుంది.

Job News: ఐఐసిటి, హైద‌రాబాద్‌లో 52 పోస్టులు

Leave A Reply

Your email address will not be published.