TG ICET: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్(CLiC2NEWS) : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐసెట్ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
దరఖాస్తు రుసుం జనరల్ అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు. ఎస్‌సి/ ఎస్‌టి / దివ్యాంగ అభ్యుర్థులకు రూ.550గా ఉంది.
మే 13, 14 తేదీల్లో పరీక్షను నిర్వహిస్తారు. 13వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. మే 14 వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు మూడో సెషన్ పరీక్ష ఉంటుంది.
మే 29వ తేదీన ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. మే 30 నుండి జూన్ 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీ ఫలితాలను జూన్ 19 తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.
[…] TG ICET: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల […]
[…] TG ICET: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల […]
[…] TG ICET: ఐసెట్ నోటిఫికేషన్ విడుదల […]