July4.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్..
Discount Sale : జులై 4వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు కస్టమర్లకు భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ‘ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్’ సందర్భంగా ఐఫోన్ 17(iPhone 17) పై రూ.12వేలు , ప్రొ మోడల్స్‌పై రూ.22 వేలు వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తోంది.
ఐఫోన్ 17 ధర రూ. 82,900 ఉండగా.. గోట్ సేల్‌లో భాగంగా రూ. 70,990 కే పొందవచ్చు. అదేవిధంగా ఐఫోన్17 ప్రొ (i phone 17 pro) ధర రూ. 1,34,900 నుండి ప్రారంభమవుతుంది. దీని ధర గోట్ సేల్ లో భాగంగా రూ. 1,12,900 కే లభించనుంది. అంటే రూ.22వేలు తగ్గనుంది. ఐఫోన్ 17 ప్రొ మాక్స్ (i phone 17 pro max ) డిస్కొంట్ ధరతో రూ. 1,27,900 కే పొందవచ్చు. మెమెరీ చిప్ కొరత కారణంగా రాబోయే రోజుల్లో ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే యూజర్లకు ఇది చక్కని అవకాశం.
ఐఫోన్ 17ఇ ధర రూ. 60,900, ఐఫోన్ ఎయిర్ ధర రూ. 95,900, ఐఫోన్ 16 ధర రూ. 59,900 ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.73,900, ఐఫోన్ 16ఇ ధర రూ.55,900, ఐఫోన్ 15 ధర రూ.49,900 నుండి ప్రారంభం అవుతాయి.
ఇంకా.. కొత్తగా ప్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకునేవారికి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. రూ. 3వేల వెల్కమ్ వోచర్లు లభిస్తాయి. ప్లస్ లేదా బ్లాక్ మెంబర్స్.. ముందు రోజే గోట్ సేల్ ఎర్లీ యాక్సెస్ పొందే అవకాశం. అంటే.. జులై 4 నుండి గోట్ సేల్ మొదలవుతుండగా జులై 3న ఎర్లీ యాక్సెస్ పొందవచ్చు.
xఇదే బాటలో అమెజాన్ (amazon) కూడా భారీ డిస్కౌంట్లను అందించనుంది. జులై 4 నుండి ప్రారంభమయ్యే సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లపైనే కాకుండా అమెజాన్ ప్రైమ్ యూజర్లకు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80% వరకు తగ్గింపు ఉండనుందని అమెజాన్ తెలిపింది. ఇంకా హోమ్ అప్లైయన్స్ , స్మార్ట్ టివి, ప్రొజెక్టర్లపై కూడా డిస్కౌంట్లు ఉండనున్నట్లు సమాచారం.
ఈ సేల్‌లో భాగంగా జూన్ 29వ తేదీన శాంసంగ్ ఎం 47 (samsung m47), జూన్ 30న వన్‌ప్లస్ ఎన్6 5జి స్మార్ట్ పోన్లను లాంచ్ చేయనున్నారు.
శాంసంగ్ గెలాక్సి ఎస్ 25 అల్ట్రా (samsung galaxy s25 ultra) ను తొలిసారి డిస్కౌంట్ ధరకు విక్రయిస్తున్నారు. దీని ధర రూ. 1,29,999 ఉండగా.. రూ.99 వేలకే అందిస్తున్నారు. వన్‌ప్లస్ 13ను రూ. 51,999కు నథింగ్ ఫోన్ (3) (nothing phone 3)ని రూ. 40, 999కే అందించనుంది.
డిస్కౌంట్ సేల్ సమయంలో షాపింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్ కే ఎక్కు వ మొగ్గుచూపుతున్నారు. దీనికనుగుణంగానే ఆయా సంస్థలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్ పోన్ ప్రియులకు మంచి అవకాశం భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటికి అదనంగా బ్యాంక్ ఆపర్లు, ఎక్సేంజ్ బోనస్, నో-కాస్ట్ ఇఎంఐ ద్వారా మరింత ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.