SBI: 9వ తరగతి నుండి ఉన్నత చదువుల వరకు స్కాలర్షిప్లు పొందే అవకాశం..
SBI Scholarships: కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (CSR) కింద స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) ఫౌండేషన్ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించనుంది. 9వ తరగతి నుండి మొదలుకొని ఆపైన విద్యను అభ్యసించదలచుకున్న వారందరూ ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. SBI ఫౌండేషన్ ద్వారా 25 వేల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ను ఇవ్వనుంది. ఈ మేరకు ఎస్బిఐ ప్లాటినం జూబ్లి ఆశా స్కాలర్షిప్-2026 విడుదలైంది. ఈ ఏడాదికి రూ.100 కోట్ల స్కాలర్షిప్ (రూ. 15వేల నుండి రూ.15 లక్షల వరకు ) లను విద్యార్థులకు ఇవ్వనుంది. దీనికోసం విద్యార్థులు దరఖాస్తులను సెప్టెంబర్ 4వ తేదీలోపు పంపించాల్సి ఉంది.
ప్రతిభ కలిగిఉండి, ఆర్ధికంగా వెనుకబడినవారు.. 9వ తరగతి నుండి డిగ్రీ, పిజి ఎంబిబిఎస్, ఐఐటి, ఐఐఎం, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం గత విద్యా సంవత్సరంలో 75%తో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 7.5% సిజిపిఎ సాధించిన వారు అర్హులు. దరఖాస్తు చేసుకోదలచిన విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. అదే కళాశాల విద్యర్తులకైతే రూ.6 లక్షల లోపు ఉండాలి.
Also Read: Educational News: Ramagundam: కరాటే విద్యార్థులకు గిన్నిస్ రికార్డులో స్థానం