స్నేహం!

హితులారా!

సన్నిహితులారా!
ప్రియ స్నేహితులారా!

మురిసిన బాల్యం

మెరిసిన స్నేహం

చెదరని బంధం

వీడని జ్ఞాపకం

నీ నా గుండెల పదిలం

లింగ వయో బేధం లేక

కులమత జాఢ్యం వాసన లేక

తారతమ్య మను భావన రాక

కదిలిన అడుగుల తేడాలేక

గడచిన సమయం తరగని మధురం

మది మదిలో అది శాశ్వతం

ఎదురు దెబ్బలు తగిలినప్పుడు

మనసు చెలించిన బాధలప్పుడు

నేనున్నానని ధైర్యము నిచ్చి

భుజం తట్టి ధీమానిచ్చి

ముందుకు నడిపిన  సహకారం

స్నేహానికి కట్టిన ప్రాకారం

పెరిగిన వయస్సు ఎంతని కాదు

పెంచుకున్న నీ స్నేహితులు ఎందరు?

దాచుకున్న నీ ధన సంపద కాదు

కాపాడు కున్న నీ స్నేహితులు ఎందరు?

కలిమిని పెంచుట కాదు

చెలిమిని పెంచుట ధర్మం

అదియే నీ నడవడికి  కొలమానం

(స్నేహితుల దినోత్సవ సందర్భంగా (2026))

-శేషం శ్రీనివాసా చార్య
Rtd GHM కరీంనగర్ 94406 59257

Read More: ఓ నేస్తమా….

Leave A Reply

Your email address will not be published.