మూడో వన్డేలో ఇండియా విజయం.. సిరీస్ కైవసం

పుణె: సొంతగడ్డపై విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్‌పై టెస్టు, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిడియా..వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2-1తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కోహ్లీసేన 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 322-9 చేసి ఓటమి చవి చూసింది.

ఇక ఇంగ్లండ్‌ జట్టులో ఆల్‌ రౌండర్‌ సామ్‌ కరన్‌ అద్భుత పోరాటంతో టీం ఇండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కరన్‌ 83 బంతుల్లో 95 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. భారత్‌ బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఠాకూర్‌ 4 వికెట్లు, భువీ 3 వికెట్లు, నటరాజన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా.. 50 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీం ఇండియా బ్యాట్స్‌మెన్స్‌లో పంత్‌, ధావన్‌ రాణించారు.

Leave A Reply

Your email address will not be published.