హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి
బిహార్: నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కోపోద్రిక్తులైన స్థానికులు అక్కడి వచ్చిన పోలీసులపై రాళ్లు విసిరారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కుకు నిప్పంటించారు. దాంతో బారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా ఈ ఘటనపై బిహార్ సిఎం విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.